భువనగిరిటౌన్: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం సేవా పతకాలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగానే తెలంగాణ సర్కార్ అత్యుత్తమ సేవలందించే పోలీస్ అధికారులకు గత కొన్నేళ్లుగా ఈ పతకాలు అందిస్తోంది. ఈమేరకు మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదాద్రి భువనగిరి జోన్ హెడ్ క్వాటర్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్(759) కె. సురేందర్‌కు మహోన్నత సేవా పతకం, ఏఆర్‌ఎస్‌ఐ సీహెచ్ శివకుమార్, ఏఆర్ ఎస్‌ఐ ఎండీ ఎక్బాల్‌పాషా, ఏఆర్ ఎస్‌ఐ డి.నాగరాజు, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ పీవీ శ్రీనివాసులుకు సేవా పతకాలు ప్రకటించారు.
13మందికి పోస్టింగ్
భువనగిరిటౌన్: రెవెన్యూ శాఖలో 13 మంది జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఇచ్చారు. భువనగిరి చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో ఇద్దరు చొప్పున మొత్తం నలుగురికి, వివిధ తహసీల్దార్ కార్యాలయాల్లో పది మందికి పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment