![ఎమ్మె](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09cpl303-230077_mr-1739132421-0.jpg.webp?itok=B3N-dIsj)
ఎమ్మెల్సీ నామినేషన్లకు నేడు ఆఖరు
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు సోమవారం ముగియనుంది. 3వ తేదీన నామినేషన్లు ప్రారంభం కాగా 7వ తేదీ వరకు 17 మంది 23 సెట్లు దాఖలు చేశారు.
భారీగా దాఖలు కానున్న నామినేషన్లు
సోమవారం పీఆర్‌టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీల మధ్య వచ్చి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ర్యా లీతో వచ్చి నామినేషన్‌ను వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
భరత్‌చంద్రాచారి
కుటుంబానికి చేయూత
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని కంకణాలగూడెం పంచాయతీ పరిధి దేశతండాకు చెందిన పదో తరగతి విద్యార్థి భరత్‌చంద్రాచారి కుటుంబానికి గుడిమల్కాపురం మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవితావిద్యాసాగర్ చేయూతనిచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో భరత్‌చంద్రాచారి పాఠశాలకు వెళ్లడానికి ఆది వారం సైకిల్, రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు తలుపుతట్టి – నిద్రలేపి కార్యక్రమానికి భరత్‌చంద్రాచారి ఇంటినుంచి కలెక్టర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ గడ్డం మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, బీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కడ్తాల కిషన్, మాజీ ఉప సర్పంచ్ పాలెం వీరేష్‌గౌడ్, మురుదొడ్డి శ్రీనివాస్, సిరిపంగి శంకర్ తదితరలు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రఽభాతం సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమంగజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసిన అనంతరం ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
![ఎమ్మెల్సీ నామినేషన్లకు నేడు ఆఖరు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09alr205-230014_mr-1739132421-1.jpg)
ఎమ్మెల్సీ నామినేషన్లకు నేడు ఆఖరు
Comments
Please login to add a commentAdd a comment