![భువనగిరిలో ముమ్మరంగా వాహన తనిఖీలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09bng26-230002_mr-1739132422-0.jpg.webp?itok=ir5NZ2Jq)
భువనగిరిలో ముమ్మరంగా వాహన తనిఖీలు
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్, జగదేవ్‌పూర్, హైదరాబాద్ చౌరస్తాల్లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఆర్‌సీలు, లైసెన్స్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నంబర్లు ప్లేట్లు సరిగా లేని వాహనాలపై దృష్టి సారించారు. ఒక కారు, మూడు ఆటోలు, 32 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు భువనగిరి ఏసీపీ రాహుల్‌రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. తనిఖీల్లో పట్టణ సీఐ కందుకూరి సురేష్‌కుమార్, ముగ్గురు ఎస్‌ఐలు, ట్రాఫిక్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా భువనగిరిలోని సమస్యాత్మక ప్రాంతాలైన హన్మాన్‌వాడ, సంజీవ్‌నగర్, పహాడీనగర్‌లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసుల సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు సీఐ సురేష్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment