![స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09cpl03-230082_mr-1739132422-0.jpg.webp?itok=S7wk0XER)
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
చౌటుప్పల్ : సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్తూ చౌటుప్పల్‌లో కాసేపు ఆగారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో కార్యకర్తలకు బండి సంజయ్ స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పూర్తిగా ఆధరణ కోల్పోయిందని, అసమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ను సైతం ప్రజలు దూరం పెట్టారని పేర్కొన్నారు. ఎవరికివారే కథానాయకులుగా మారి పార్టీ విజయం కోసం పని చేయాలని కోరారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మండల, మున్సిపల్ అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పన, నాయకులు ఆలె చిరంజీవి, ముత్యాల భూపాల్‌రెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, పోలోజు శ్రీధర్‌బాబు, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, ఆలె నాగరాజు, దాసోజు భిక్షమాచారి, బత్తుల జంగయ్య, చినుకని మల్లేష్, రాదారపు సత్తయ్య, కడారి అయిలయ్య, నూనె సహదేవ్, దిండు భాస్కర్, పబ్బు వంశీ, ఊదరి రంగయ్య, ఇటికాల దామోదర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బండి సంజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment