బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా
కడప కార్పొరేషన్ : బుగ్గ వంకపై పెడస్టల్ బ్రిడ్జ్‌ల నిర్మాణంతో నగర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. మంగళవారం రవీంద్ర నగర్ లోని షామీరియా దర్గా సమీపంలో, నాగరాజుపేటలో లా కాలేజీ వద్ద బుగ్గ వంకపై బ్రిడ్జిల నిర్మాణానికి నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, కమిషనర్ ప్రవీణ్ చంద్‌లతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నగర ప్రజలు ఎదురుచూస్తున్న బుగ్గ వంకపై రూ. 20 కోట్లతో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారీ రవీంద్ర నగర్, నాగరాజు పేట ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని, ఈ పరిస్థితిని గమనించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బుగ్గ వంక నదీ పరివాహ ప్రాంతానికి రక్షణ గోడలు, రోడ్ల అభివద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుగ్గవంక నదికి రక్షణ గోడలు నిర్మాణం కోసం రూ.56 కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేయడం నగర ప్రజలకు వరమన్నారు. బగ్గవంక చుట్టూ రక్షణ గోడ లు నిర్మించడం వల్ల పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు భవిష్యత్తులో నిశ్చింతగా ఉండొచ్చని పేర్కొన్నారు. బుగ్గ వంకకు ఇరువైపులా 40 అడుగుల రోడ్డును రూ.15 కోట్లతో పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రజలకు పెద్ద నగరాలకు వెళ్లకుండా ఎలాంటి అనారోగ్యం వచ్చిన మన జిల్లా కేంద్రం కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నామన్నా రు. నగర అభివద్ధికి రూ.2150 కోట్లతో పలు అభివద్ధి పనులు చేపడుతున్నామని ఇందులో కూడళ్ళు, రహదారులు, డ్రైన్ల వేగవంతంగా పనులు నడుస్తున్నాయన్నాయని.. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
కడప నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ... బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న నగర ప్రజలు చాలా ఏళ్లుగా వరదలతో చాలా ఇబ్బందులకు గురయ్యారని వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపుతూ.. నేడు బుగ్గవంక పెడస్టల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రూ.70 కోట్లతో బుగ్గ వంక రక్షణ గోడలకు అనుమతి మంజూరు చేసి 85 శాతం పనులు పూర్తి చేశారన్నారు. కడప నగరాన్ని ఒక ప్రణాళిక బద్ధంగా అభివద్ధి చేయాలని నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో నగర సుందరీకరణలో భాగంగా నేడు వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్, డిప్యూటీ మేయర్లు ముంతాజ్ బేగం, నిత్యానంద రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్. సుబ్బారెడ్డి, అజ్మతుల్లా, రెడ్డి ప్రసాద్, షఫీ, మైనార్టీ శాఖ సలహాదారులు మొహమ్మద్ అలీ బాగ్దాది తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
నగర మేయర్ సురేష్ బాబుతో కలిసి రూ.20 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణానికి భూమి పూజ
Comments
Please login to add a commentAdd a comment