కడప రూరల్: వెద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య తెలిపారు. 15 ఖాళీలు ఉన్నాయని.. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు నమూనాను సీఎఫ్ డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని, భర్తీ చేసిన దరఖాస్తులను నిర్దేశించిన రుసుముతో పోస్టుకు సంబంధించిన సర్టిఫికెట్లను జతపరచాలని తెలిపారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 4 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కడప పాత రిమ్స్ లో గల వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment