బాకీ డబ్బు ఇవ్వలేదని ఇంటికి తాళం
ప్రొద్దుటూరు క్రైం : బాకీ డబ్బు ఇవ్వలేదనే కారణంతో ఇంటికి తాళం వేసిన ఘటన ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన శ్రీపతి చంద్రలీల కడపలోని సచివాలయంలో పని చేస్తోంది. ఆమె భర్త మదన్‌మోహన్‌బాబు మెడికల్ షాపు నిర్వహించేవాడు. భార్యకు తెలియకుండా అతను అప్పులు చేసి ఇల్లు వదలి ఎక్కడికో వెళ్లిపోయాడు. మదన్‌మోహన్‌బాబు తన ఇంటి కాగితాలను పెట్టి సుబ్బారెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి రూ. 2.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. బాకీ విషయమై అతను చంద్రలీలకు చెప్పగా భర్త చేసిన అప్పుతో తనకు సంబంధం లేదని చెప్పింది. ఆదివారం చంద్రలీల భోజనానికి తన అమ్మగారింటికి వెళ్లింది. తన ఇంటి గేటుకు సుబ్బారెడ్డి అనే వ్యక్తి తాళం వేశాడని వీధిలో వాళ్లు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె వెంటనే ఇంటికి వచ్చింది. దీంతో చంద్రలీల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment