రాయలసీమ డిక్లరేషన్‌పై స్పందించాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రాయలసీమ డిక్లరేషన్‌పై బీజేపీ ప్రజా ప్రతినిధులు స్పందించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ. గఫూర్ డిమాండ్ చేశారు. ఆదివారం కడపలో సీపీఎం 12వ జిల్లా మహాసభల సందర్భంగా సీతారాం ఏచూరి (అజ్మత్ ఫంక్షన్ హాల్) ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, కర్నూలుకు చెందిన పార్థసారథి, మంత్రి సత్యకుమార్ రాయలసీమ డిక్లరేషన్ అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రయత్నించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం నిధులు తేవాలన్నారు. రాయలసీమ సమస్యలు పట్టించుకోకపోతే ప్రజలు క్షమించరన్నారు. భూస్వాములు లక్షలాది ఎకరాలను పేదలకు దక్కకుండా ఆక్రమించుకున్నారని, వాటిపై విచారణకు ఎందుకు ఆదేశించారని నిలదీశారు. వైఎస్ మరణం తరువాత సాగునీటి ప్రాజెక్టులపై జగన్, చంద్రబాబు నాయుడు శీతకన్ను వేశారని విమర్శించారు. రూ. 1500 కోట్లు కేటాయిస్తే బ్రహ్మంసాగర్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మైలవరం ఆయకట్టు 90 వేల ఎకరాలకు కేవలం 15 నుంచి 20,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి పోలవరం జపమే తప్ప రాయలసీమ సమస్యలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఉమ్మడి వైఎస్సార్, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లోని చెరువులకు నీరు నింపాలన్నారు. కుప్పం కెనాల్‌కు సిమెంట్ లైనింగ్ చేయడం మంచిదేనని, హంద్రీ–నీవా విస్తరణ పట్టదా అని అడిగారు కొప్పర్తి ఎంఎస్‌ఎంఈ సెంటర్‌ను, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని, నార్కోటెక్ డ్రగ్ లీగల్ కోర్టును తరలించే హక్కు ఎవరిచ్చారన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు రామమోహన్, మనోహర్, శివకుమార్ పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ. గఫూర్
Comments
Please login to add a commentAdd a comment