కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు
కడప అర్బన్ : కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (డీటీసీ)లో దేహదారుడ్య (పీఎంటీపీఈటీ) పరీక్షలు 7వ రోజు కొనసాగాయి. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షించారు. మంగళవారం 600 మంది అభ్యర్థులకుగాను 442 మంది పరీక్షలకు హాజరయ్యారు. 274 మంది క్వాలిఫై అయ్యారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఐటీ కోర్ టీమ్, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment