పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప రూరల్ : వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో మంగళవారం జూనియర్ అసిస్టెంట్స్ నుంచి సీనియర్ అసిస్టెంట్స్ పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 మందికి గాను 8 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పదోన్నతులను కల్పించినట్లు తెలిపారు. ఆ శాఖ డిప్యూ టీ డైరెక్టర్ భక్తవత్సలం, సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, వనిషా తదితరులు పాల్గొన్నారు.
11 నుంచి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు
కడప కల్చరల్ : కడప శిల్పారామంలో ఈనెల 11 నుంచి సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామని శిల్పారామం పాలనాధికారి పి.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన కరపత్రాలను ఆవిష్కరించి విలేకరులతో మాట్లాడారు. పోటీల్లో భాగంగా 11న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు చుక్కల ముగ్గుల పోటీలను నిర్వహిస్తామని, 12న ఆదివారం కిశోర్ బృందం సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. 13న బోగి మంటలు, కళా తరంగిణి బృందంచే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. 14న సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 5 నుంచి గాలిపటాల ఎగురవేసే కార్యక్రమం, అనంతరం అనూష్ బృందం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సంక్రాంతి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ గంగిరెద్దు ఆటలను నిర్వహిస్తామన్నారు. 15న అఖిల్ బృందం వారిచే కామెడి స్కిట్లు ప్రదర్శిస్తారన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొనదలిచిన వారు 11వ తేది ఉదయం 9 గంటల నుంచి 10 గంటల్లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment