ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తనిఖీలు
కడప కల్చరల్ : దేవదాయశాఖ పరిధిలో ఉన్న దేవాలయాలు, సత్రాలు, మఠాలు, ఇతర ఛారిటీ సంస్థలకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను దేవదాయశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం కడప నగరంలోని జిల్లా దేవదాయ ధర్మదాయశాఖ కార్యాలయంలో కర్నూలు ఉప కమిషనర్ గురుప్రసాద్ తనిఖీలు చేపట్టారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లన్నీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలని సూచించారు. వీటికి బ్యాంకు వడ్డీ సక్రమంగా జమ అవుతుందో లేదో కూడా ప్రతి మూడు మాసాలకు ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. దేవాలయాల ఉద్యోగులంతా తప్పకుండా డ్రస్‌కోడ్ పాటించాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్, జిల్లాలోని అన్ని ఆలయాల ఈఓలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment