కడప సెవెన్‌రోడ్స్ : భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు లు బుధవారంతో ముగియనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. చివరిరోజు జిల్లాలో 17 గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బద్వేలు రెవెన్యూ డివిజన్‌లోని అట్లూరు మండలం కొండూరు, కలసపాడు మండలం రెడ్డిపల్లి, కాశినాయన మండలం సావిసెట్టిపల్లి, పోరుమామిళ్ల మండలం మిద్దపాడు, చెన్నకృష్ణాపురం, పులివెందుల రెవెన్యూ డివిజన్‌లోని చక్రాయపేట మండలం గండికొవ్వూరు, లింగాల మండలం పార్ణపల్లె, సింహాద్రిపురం, పులివెందుల మండలం రాగిమానిపల్లిలో సదస్సులు జరుగుతాయని వివరించారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోని మైలవరం మండలం లింగాపురం, పెద్దముడియం మండలం పాలూరు, కొండాపురం మండలం వెంకయ్యకాల్వ, జమ్మలమడుగు మండలం పొన్నతోట, ముద్దనూరు మండలం యామవరం, దువ్వూరు మండలం చింతకుంట, చాపాడు మండలం అల్లాడుపల్లె, కడప రెవెన్యూ డివిజన్‌లోని కమలాపురంలో రెవెన్యూ సదస్సులు జరుగనున్నాయని డీఆర్వో తెలిపారు.
రుణాలకు
దరఖాస్తుల ఆహ్వానం
కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హులైన బీసీ అభ్యర్థులు స్వయం ఉపాధి పథకంలో భాగంగా బ్యాంకు లింకేజీ కింద రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహా తెలిపారు. ఒక యూనిట్ విలువ రూ. 5 లక్షల్లోపు రుణాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ పరిధిలో 1550, ఈబీసీ కింద 74, కమ్మ కార్పొరేషన్ 27, రెడ్డి కార్పొరేషన్ 98, ఆర్యవైశ్య కార్పొరేషన్ 17, క్షత్రియ కార్పొరేషన్ 16, బ్రాహ్మణ కార్పొరేషన్ 8, కాపు కార్పొరేషన్ 379, కాపు ఎంఎస్‌ఈ గ్రూప్‌లోన్ కింద మూడు యూనిట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే జనరిక్ మెడికల్ షాపు కింద యూనిట్ విలువ రూ. 8 లక్షలకుగాను బీసీలకు 32, ఈబీసీలకు 14, కమ్మలకు 4, రెడ్డి కార్పొరేషన్‌కు 16, ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు 3, క్షత్రియ కార్పొరేషన్‌కు 3, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 1 యూనిట్ ఉంది. మొత్తం 2245 యూనిట్లను 2245 మంది అభ్యర్థులకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను అర్హతగల వారు ఆధార్, రేషన్‌కార్డులు, ఆధాయ ధ్రువీకరణ, కుల సర్టిఫికెట్‌తోపాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఏపీఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్‌లో ఈనెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హెచ్‌ఎంపీవీపై
ఆందోళన వద్దు
– డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు
కడప రూరల్ : హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మేటా న్యూ వైరస్)పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. ఈ వైరస్ జిల్లాతో పాటు రాష్ట్రంలో మరెక్కడా లేదన్నా రు. కోవిడ్ వైరస్ తరహాలోనే ఈ వైరస్ కూడా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తుల నుంచి దగ్గు, తు మ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వ్యాధి సోకుతుందన్నారు. ఈ వైరస్ సోకిన మూడు నుంచి 10 రోజులలోగా లక్షణాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. వైరస్ సోకిన వారిలో కొన్ని మార్లు నిమోనియా, బ్రాంకైటీస్ లాంటి శ్వాసకోశ సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలను పాటించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment