మామిడి రైతు ఆశల్ని పొగమంచు ఆవిరి చేసేలా ఉంది. నిండుగా ప
వేంపల్లె: అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు, దట్టమైన పొగ మంచు మామిడి రైతులకు శాపంగా మారింది. ఇటీవల నవంబర్, డిసెంబర్ మాసాలలో వరుస తుపాన్ల కారణంగా కురిసిన వర్షాలతో భూమిలో తేమశాతం పెరగడమే కాకుండా వాతావరణంలో మార్పు చోటు చేసుకున్నాయి. ఫలితంగా మామిడి చెట్లకు పూత రావడంలో ఆలస్యం అవడంతో రైతులు కలవరపడుతున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి పూత వచ్చి, ఫిబ్రవరి, మార్చి నెలలో పిందెలు కాసేవి. కానీ జనవరి నెల వచ్చినా ఇంతవరకు పూత జాడే కనిపించకపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు.
13వేల హెక్టార్లలో మామిడి తోటలు
జిల్లా వ్యాప్తంగా సుమారు 13వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. వేసవిలో వచ్చే మామిడి పంట జిల్లాలో 20 మండలాలలో మేజర్ క్రాప్ ఇదే. ఇందులో 65 శాతం తోతాపురి మామిడి రకం సాగు చేస్తున్నారు. దీంతోపాటు నీలం, బేనీషా, ఖాదర్, ఇమాం పసంద్, మల్లికా వంటి రకాలు సాగులో ఉన్నాయి.
మామిడి పూత కోసం రైతులు పాట్లు
మామిడి తోటల్లో అరకొరగా పూసిన పూత ఆపేందుకు ఒకవైపు, కొత్తగా పూత వచ్చేందుకు మరోవైపు రైతులు నానా పాట్లు పడుతున్నారు. దీనికితోడు మామిడి పూత రసం పీల్చే నల్లి, మామిడి పూతను తొలిచే పురుగు మామిడి పంటను ఆశించాయని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ.45వేల నుంచి రూ.50వేల చొప్పున ఖర్చు చేస్తూ మూడు దఫాలుగా మందులు స్ప్రే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో అనుకున్న సమయానికి మామిడి పూత వస్తే ఎకరానికి ఐదు టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంతవరకు మామిడి పూత దశ కనిపించకపోవడంతో ఈ ఏడాది కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు కోలుకోవడం కష్టమవుతుందని ఆవేదన చెందుతున్నారు.
సలహాలు, సూచనలు ఎక్కడ..
ఉద్యాన పంటల సీజన్లలో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ఉద్యాన శాఖ (హార్టికల్చర్) అధికారులు మామిడి తోటలను పట్టించుకోవడంలేదని పలువురు రైతులు వాపోతున్నారు. వచ్చిన మామిడి పూత రాలకుండా కొత్త పూత వచ్చేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై అధికారులు అవగాహన కలిగించాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో ఆ దశగా చర్యలు ఎక్కడ కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో ఎక్కడా హార్టికల్చర్ అధికారులు కనిపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులే సొంతంగా మందులు పిచికారి చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు మామిడి తోటలను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
మామిడి రకాలు.. నీలం.. బేనీషా.. ఖాదర్.. ఇమాం పసంద్, మల్లికా..
జాడ కనిపించని మామిడి పూత!
జిల్లావ్యాప్తంగా 13వేల హెక్టార్లలో మామిడి సాగు
వాతావరణ మార్పుతో పూతకు రాని వైనం
ఎకరాకు రూ.45వేలకుపైగా ఖర్చు
ఆందోళన చెందుతున్న రైతులు
జిల్లాలో
మామిడి సాగు
13.000..
(హెక్టార్లలో)
Comments
Please login to add a commentAdd a comment