ఉపాధ్యాయులను వేధించడమే లక్ష్యం
ఉపాధ్యాయులను నిరంతరం ఏదో ఒక రకంగా వేధించడమే డీఈఓ లక్ష్యం. ఆమె ఉపాధ్యాయులను బానిసల్లాగా చూస్తోంది. ఉపాధ్యాయులను విద్యార్థుల ముందే నిందించడం, అసభ్యకరమైన పదజాలంతో దూషించడం పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అపార్‌ను పూర్తి చేయడంలో జిల్లా 5వ స్థానంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 829 మంది ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు జారీ చేసి చరిత్రకెక్కారు. సమగ్ర శిక్షలో చిరు ఉద్యోగుల జీతాలను నిలిపివేశారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారు. తక్షణం ఆమెను డీఈఓగా తప్పించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం.
– మాదన విజయకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ఉపాధ్యాయుల పట్ల డీఈఓ సున్నితంగా వ్యవహరించకుండా కఠిన వైఖరి ప్రదర్శించడం సరికాదు. అందరూ అంకిత భావంతో పని చేసే వారే. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు బోధనలో కొంతమేర తప్పు జరిగివుంటే సున్నితంగా సరిదిద్దాలి. అంతే గానీ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం దెబ్బతినేలా ప్రవర్తించడం డీఈఓకు భావ్యం కాదు. టీచర్లను వ్యక్తిగతంగా బాధపెట్టే విధంగా మాట్లాడటం, వ్యక్తి రూపాన్ని బట్టి తిట్టడం, అసభ్య పదజాలంతో ప్రధానోపాధ్యాయులను మాట్లాడటం చాలా బాధాకరం. ఇలాంటి డీఈఓ పట్ల ప్రభుత్వం వెంటనే ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలి.
– ఎస్.రామాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్‌టీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment