ప్రొటోకాల్ పాటించని అధికారులు
పులివెందుల టౌన్ : ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం పులివెందుల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళానా, లేక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళానా అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాలన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులైన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిల ఫొటోలు లేకుండా ఇటీవల జాబ్‌మేళా ఎలా నిర్వహించారన్నారు. ఈ జాబ్‌మేళాకు వార్డ్ కౌన్సిలర్, మునిసిపల్ చైర్మన్‌ను కూడా ఆహ్వానించకపోవడం దేనికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేక, నియంతృత్వంలో ఉన్నామా అని ప్రశ్నించారు. గతంలో ప్రతి ప్రారంభోత్సవ శిలా ఫలకంపైన ప్రొటోకాల్ పాటించామని, అలా పాటించాలని సాక్షాత్తూ ఎంపీ అవినాష్‌రెడ్డే అధికారులకు చెప్పేవారన్నారు. కనీసం ప్రొటోకాల్ పాటించని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వారు పట్టించుకోకపోతే కోర్టులకు వెళ్లి తేల్చుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment