ముగిసిన మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీల ముగింపు, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ సింగం భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు, ట్రోఫీలు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యంగా ఉండేందుకు ఏదో ఒక క్రీడను ఎంపిక చేసుకుని ఆడాలని సూచించారు. జిల్లాలో ఓ వయసు దాటిన తర్వాత ఎక్కువ మంది బ్యాడ్మింటన్ క్రీడ ఆడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. టోర్నమెంట్ రెఫరీ, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం చైర్మన్ ఎస్.జిలానీబాషా మాట్లాడుతూ చాలా మంది క్రీడాకారులు యువ క్రీడాకారులకు దీటుగా చక్కటి ప్రదర్శనతో రాణించారన్నారు. అదే స్ఫూర్తిని రాష్ట్రస్థాయి పోటీల్లో కనబరచాలని సూచించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఫిబ్రవరిలో విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, డీఎస్‌ఏ కోచ్ సుదర్శన్, అఫిషియల్స్ మనోహర్‌బాబు, చంద్రబాబురెడ్డి, సోనీశామ్యూల్, మహేష్, షామీర్, జాకీర్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు
35 ప్లస్ విభాగం : ఎస్.షరీఫ్–ఎం.హరికిశోర్, టి.సూర్యమోహన్– జె.లోకేష్
మిక్స్‌డ్ డబుల్స్ : ఎ.మధుసూధన్‌రెడ్డి–ఎ.దేవి.
40 ప్లస్ విభాగం : జి.సురేష్–డి.వి.సుబ్రమణ్యం, పి.బాలాజీ–ఆర్.రామకృష్ణ
45 ప్లస్ విభాగం : బి.సుదర్శన్, ఎన్.నరేంద్రబాబు, బి.రమేష్
50 ప్లస్ విభాగం : కె.కృష్ణయ్య, వి.తులసిరామ్, వి.నాగరాజు
55 ప్లస్ విభాగం : వై.జనార్ధన్‌రెడ్డి, జి.శ్రీనివాసులు, కె.రామస్వామిరాజు
60 ప్లస్ విభాగం : కె.అబ్రహం, ఎ.కుళాయిస్వామి, ఆర్.రామచంద్రయ్య
65 ప్లస్ విభాగం : జయచంద్ర
రాష్ట్రస్థాయికి 25 మంది క్రీడాకారుల ఎంపిక
విజేతలకు ట్రోఫీల బహూకరణ
Comments
Please login to add a commentAdd a comment