విద్యావ్యవస్థకు పనికిరారు
జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా ఉండాల్సిన డీఈఓ అధికారం ఉంది కదా అనే అహంకారంతో తన మాటతీరు, వింత ప్రవర్తనతో ఉపాధ్యాయులను మానసికంగా హింసిస్తూ క్షోభకు గురి చేస్తున్నారు. ఇలాంటి అధికారి విద్యావ్యవస్థకు పనికిరారు. విద్యార్థుల ఎదుటే ఉపాధ్యాయులను కించపరుస్తూ అభ్యంతరకరమైన పదజాలంతో తిడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉపాధ్యాయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఇటువంటి అధికారి వల్ల ఉపాధ్యాయులు బోధనపై మనసు నిమగ్నం చేయలేకున్నారు. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి మనస్తత్వం కలిగిన అధికారి విద్యావ్యవస్థకు పనికిరారు. ఈమెను వెంటనే విధుల నుంచి తప్పించాలి.
– మోపూరి వెంకట శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ
ఆదర్శంగా ఉండాల్సిన..
ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారే.. సహనం కోల్పోయి కింది స్థాయి సిబ్బందిని దుర్బాషలాడుతూ అవమానిస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోగా పురుగుల్లా చూస్తోంది. ఆమె తీరుకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ‘ఆత్మగౌరవ ఉద్యమాన్ని‘ పాలకులు పరిగణనలోకి తీసుకుని, ఉపాధ్యాయులను అవమానిస్తున్న డీఈఓను విధుల నుంచితప్పించాలి.
– నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ
Comments
Please login to add a commentAdd a comment