పెన్షన్ మంజూరు కోసం వచ్చి..
కడప సెవెన్‌రోడ్స్ : వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని చాలా రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో.. కలెక్టర్‌కు తన గోడు చెప్పుకొంటే ప్రయోజనం ఉంటుందని భావించి వ్యయ ప్రయాసల కోర్చి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచ్చిన ఓ వృద్ధుడు ఫిట్స్ రావడంతో సభా భవనం వద్ద పడిపోయాడు. దీంతో పీజీఆర్‌ఎస్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో వాహనం అక్కడికి చేరుకోవడంతో వృద్ధుడిని వెంటనే ఎక్కించి రిమ్స్‌కు తరలించారు. పోరుమామిళ్ల మండలం రామనపల్లె గ్రామానికి చెందిన ఆ వృద్ధుడి పేరు రామయ్యగా తెలిసింది.
పరికరాల అమరికలో
జాగ్రత్తలు తీసుకోవాలి
కడప అగ్రికల్చర్ : గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల పొలాలకు అమర్చే బిందు, తుంపర సేద్య పరికరాల అమరికలో ఇంజినీర్లు, ఎఫ్‌సీఓలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం(ఏపీ ఎంఐపీ) ఏపీడీ మురళీమోహన్‌రెడ్డి సూచించారు. సోమవారం కడప కలెక్టరేట్‌లోని ఏపీ ఎంఐపీ పీడీ కార్యాలయంలో జిల్లా ఎంఐ కంపెనీ ఇంజినీర్లు, ఎఫ్‌సీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–15 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 29,300 హెక్టార్లకు సూక్ష్మ సేద్యానికి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. బిందు, తుంపర సేద్య పరికరాలు అవసరం ఉన్న ప్రతి రైతు తమ పరిధిలోని ఆర్‌ఎస్‌కేలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ ఎంఐ ఇంజినీర్లు, ఎంఐడీసీలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment