పార్టీ పదవులు అలంకారప్రాయం కాకూడదు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇస్తున్న పదవులు అలంకారప్రాయం కాకూడదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం తనను జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడం పట్ల పొట్టిపాటి జయచంద్రారెడ్డి ఆయనను సత్కరించారు. అనంతరం మేయర్ సురేష్ బాబును కూడా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులు పొందిన వారు క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. త్వరలోనే వారికి శిక్షణ కూడా ఉంటుందని తెలిపారు. అనంతరం జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకముంచి పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రామ్మోహన్‌రెడ్డి, మునిశేఖర్‌రెడ్డి, దాసరి శివప్రసాద్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment