ప్రజల్లో న్యాయవిజ్ఞానం పెరిగేలా కృషిచేయాలి
రాయచోటి అర్బన్: ప్రజల్లో న్యాయవ్యవస్థ, రాజ్యాంగం, చట్టాలపై పరిజ్ఞానం పెరిగేలా భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) కృషిచేయాలని రాయ చోటి 5వ అదనపు జిల్లా జడ్జి కృష్ణన్‌కుట్టి అన్నారు. శుక్రవారం కోర్టు ఆవరణలో నిర్వహించిన ఐఏఎల్–2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదే శానుసారం న్యాయవిజ్ఞాన సదస్సులు దేశవ్యాప్తంగా జరుగతున్నాయన్నారు. అయినప్పటికీ ప్రజల్లో చట్టాలపట్ల, రాజ్యా ంగ పట్ల మరింతగా విజ్ఞానం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
● భారత రాజ్యాంగం, చట్టాల గురించి ప్రజలందరికీ వివరించేందుకు భారత న్యాయవాదుల సంఘం వచ్చేవారం నుంచి చైతన్యసదస్సులను నిర్వహిస్తున్నట్లు ఐఏఎల్ ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట ఈశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆనంద్‌కుమార్, రెడ్డియ్యలు అన్నారు. రాయచోటి బార్ అసోసియేషన్ అధ్య క్షుడు ఎన్.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి రెడ్డెయ్య. డి.నాగముని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment