మొన్నొచ్చిన రాంప్రసాద్‌రెడ్డి మంత్రి కాలేదా..!
బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో శనివారం టీడీపీ వర్గాల మధ్య చోటుచేసుకున్న ఫ్లెక్సీ వివాదంలో ఓ కార్యకర్త.. పార్టీ మారిన రాంప్రసాద్‌రెడ్డి మంత్రే అయ్యాడు ఇక సీనియారిటీ ఏం లెక్కనా అన్న ధోరణిలో మాట్లాడిన తీరు టీడీపీలో చర్చనీయాంశమైంది. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి శనివారం బి.కొత్తకోట మీదుగా ములకలచెరువుకు వెళ్తుండటంతో టీడీపీ నేత జయచంద్రారెడ్డి వర్గీయుడు చిటికె శివారెడ్డి జ్యోతిచౌక్‌లో ఫ్లెక్సీలు కట్టిస్తుండగా.. తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్ వర్గీయులు దేవరింటి కుమార్, చాకన రాజా, సురేంద్ర, ప్రకాష్, శ్రీనాఽథ్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ ఫొటోలతో పెట్టిన ఫ్లెక్సీలపై ఫ్లెక్సీ కడుతుండగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మేం ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేశామని, అప్పుడు మీరెక్కడున్నారని జయచంద్రారెడ్డి వర్గీయుడు చిటికె శివారెడ్డిని శంకర్ వర్గీయులు నిలదీశారు. దీంతో శివారెడ్డి..రాం ప్రసాద్‌రెడ్డి మొన్ననే వచ్చింది.. మంత్రి కూడా అయ్య.. ఇప్పుడు ఆయనకే పూలహారాలు వేస్తావుండ్లా మీరు.. అని చిందులేశాడు. పోలీసులు చేరుకుని శంకర్ ఫ్లెక్సీలపై కట్టకుండా పక్కన కట్టాలని సూచించడంతో వివాదం ముగిసింది. మంత్రిపై చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దీనిపై జయచంద్రారెడ్డిని ఆరా తీసినట్లు తెలిసింది.
వైరల్‌గా మారిన టీడీపీ కార్యకర్త వా్‌య్‌ఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment