అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య
మదనపల్లె : అనారోగ్యంతో మనస్తాపం చెంది ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లు రంగారెడ్డి కాలనీకి చెందిన మదన్‌మోహన్ కుమారుడు సోమశేఖర్ (26) పట్టణంలోని సిద్ధార్థ సినిమా థియేటర్ సమీపంలోని బార్బర్ షాప్‌లో పని చేస్తున్నాడు. దీంతోపాటు బళ్లారి డ్రమ్స్ వాయిద్య ప్రదర్శనలకు వెళుతూ ఉంటాడు. గత ఏడాది వినాయక చవితి సందర్భంగా ఓ ప్రదర్శనకు వెళ్లగా, డ్రమ్స్ వాయిస్తూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఒకవైపు పక్క ఎముకలు విరిగి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. అప్పటినుంచి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందాడు. అయినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. డ్రమ్స్ వాయించేందుకు వెళ్లలేకపోయాడు. మూడు రోజుల నుంచి పనికి వెళ్లకుండా ఇంటి వద్ద ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లోనే మరో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తాలూకా ఎస్‌ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment