దూర విద్యతో ఉజ్వల భవిష్యత్తు
కడప ఎడ్యుకేషన్ : దూర విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దూరవిద్య డైరెక్టర్ అశోక్ యాదవ్ పేర్కొన్నారు. దూర విద్య ద్వారా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ ద్వారా ఆన్‌లైన్ డిగ్రీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏలతోపాటు పలు రకాల కోర్సులు చేయవచ్చన్నారు. ఈ సర్టిఫికెట్ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రమోషన్లకు కూడా అర్హత ఉంటుందన్నారు. దీంతోపాటు ఓపెన్ పది, ఇంటర్ కోర్సులకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
వంకలో దిగి పశువుల కాపరి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం రోటరీ సమీపంలోని వంకలో దిగి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కదిరి నియోజకవర్గం పట్నం గ్రామానికి చెందిన ముస్తఫా(68) రెండేళ్ల నుంచి పులివెందుల పట్టణంలోని సుబ్రహ్మణ్యం దగ్గర పశువులు మేపుకుంటుండేవాడు. రోజు మాదిరిగానే శనివారం పశువులను మేపుకునేందుకు రోటరీపురం సమీపంలోకి వెళ్లాడు. అక్కడ పశువులు వంకలోకి దిగాయని ముస్తఫా కూడా దిగాడు. అతనికి ఈత రాక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ విష్ణు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ వద్ద మధ్యం మత్తులో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కడప రామాంజనేయపురానికి చెందిన శ్రీనివాసులు గా గుర్తించారు. కడప తాలూకా పోలీసులు దర్యాప్తు చేశారు. వ్యక్తి మద్యం అతిగా తాగి మృతి చెందాడా. మరి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
యథేచ్ఛగా
ఇసుక అక్రమ రవాణా
సిద్దవటం : మండలంలోని పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజల అవసరాలకు మాత్రమే ఉచిత ఇసుక పాలసీని అమలు చేసిందన్నారు. సిద్దవటం మండలంలోని టక్కోలు, మాచుపల్లె గ్రామాల సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను ట్రాక్టర్‌ల ద్వారా కడపకు తరలిస్తున్నారని, అక్కడ రూ. 4వేల నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. అక్రమంగా ఇసుక తరలిపోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment