ఆరోగ్యశ్రీకి తిలోదకాలిస్తున్న చంద్రబాబు
కడప సెవెన్‌రోడ్స్ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి తిలోదకాలిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొత్తం మూడు వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఆ పథకాన్ని మరింత పటిష్టం చేశారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పథకాన్ని నీరుగార్చేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నారా లోకేష్‌కు సన్నిహితులైన ఒక ప్రైవేటు బీమా కంపెనీకి అప్పగించడం ద్వారా ముడుపులు తీసుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకంతో చంద్రబాబు వ్యాపారం నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాల పరిమితి ముగిసిన 108 వాహనాలను తొలగించి 1080 కొత్త వాహనాలను సమకూర్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తయినప్పటికీ ప్రజలకు నష్టాలే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్‌కుమార్, కార్పొరేటర్ షఫీ, త్యాగరాజు, కిరణ్, అఖిల్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీ పాల్గొన్నారు.
రెట్టించిన ఉత్సాహంతో సేవలందించాలి
కడప కల్చరల్ : ఇంతవరకు పార్టీకి అందించిన సేవలను గుర్తించి కార్యకర్తలకు కీలక పదవులు ఇచ్చారని, రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందించాల్సిన అవసరం ఉందని నాయకులు, కార్యకర్తలు, ఆయా విభాగాల ప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీలో పలువురు కార్యకర్తల సేవలను గుర్తించి వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ నియామకాలు చేపట్టామన్నారు. బాధ్యతలు స్వీకరించిన కార్యకర్తలంతా చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.
వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment