యువకునిపై దాడి
లింగాల : లింగాల మండలం రామన్నూతనపల్లె గ్రామంలో లోమడ గురుడు(18) అనే యువకునిపై గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన రాత్రి కొందరు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. వెంటనే మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడని యువకుని తండ్రి లోమడ సూరుడు తెలిపారు. వివరాలిలా.. గురుడు గ్రామంలోని ఒక యువతిని ప్రేమిస్తున్నాడని, ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు డిసెంబర్ 31వ తేదీ రాత్రి గురుడుకు ఫోన్ చేసి ఇంటి వద్దకు పిలిపించారు. ప్రసాద్, గణేష్, సదా నిరంజన్, ప్రభుదేవా అనే వ్యక్తులు ఒక్కసారిగా ఇతనిపై దాడి చేశారు. తమ కుమారుడు అలాంటి వాడు కాదని, ఏ ఉద్దేశంతో దాడి చేశారో తెలియదని యువకుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
అట్లూరు : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. కడప–బద్వేలు ప్రధాన రహదారిపై అట్లూరు క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న అటవీ చెక్‌పోస్టు వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను ఆపి తనిఖీ చేశామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా సిద్దవటం సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు తేలడంతో ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించామన్నారు.
మనస్తాపంతో పురుగుల మందు తాగి
ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment