ఈ డీఈఓ మాకొద్దు.!
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా మాట్లాడితే ఎంతవరకై నా పోరాడతామని విద్యాశాఖను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. ఈ డీఈఓ మాకొద్దంటూ శనివారం కడప డీఈఓ కార్యాలయం ఎదుట వందల సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు కదం తొక్కారు. డీఈఓ డౌన్ డౌన్.. ఈ డీఈఓ మాకొద్దంటూ నానాదాలతో డీఈఓ కార్యాలయ ఆవరణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే ఈ విధంగా ఏ అధికారి ప్రవర్తించలేదన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి వివిధ సమస్యలపై డీఈఓను కలిసేందుకు ప్రయత్నిస్తే సాయంత్రం 6 గంటల తరువాత ఆఫీసుకు వస్తారన్నారు. పాఠశాలల పర్యవేక్షణకు వెళ్లినప్పుడు హెచ్‌ఎం, ఉపాధ్యాయుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారన్నారు. ఒక మహిళా ప్రధానోపాధ్యాయురాలి ముఖంపై ఉమ్మేసి దుర్భాషలాడారని ఆరోపించారు. ఎవరైనా ప్రధానోపాధ్యాయులు సెలవులో ఉంటే ఇన్‌చార్జితో వాడు ఎందుకు రాలేదు.. వాడిని పిలిపించు.. అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపార్ నమోదులో జిల్లాను ఐదవ స్థానంలో నిలిపినప్పటికి జిల్లా వ్యాప్తంగా 821 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారన్నారు. ఉన్నతాధికారులు విచారించి ఈమైపె తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఐక్యవేదిక ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక
ఆధ్వర్యంలో ధర్నా
జేసీకి వినతిపత్రం
Comments
Please login to add a commentAdd a comment