ఉర్దూ యూనివర్సిటీలో పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ఉర్దూ యూనివర్సిటీలో పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు

Published Sat, Oct 19 2024 2:24 AM | Last Updated on Sat, Oct 19 2024 2:24 AM

-

వైవీయూ: కర్నూలు నగరంలోని డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద పరిమిత సంఖ్యలో మిగిలిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్ల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్‌ వి.లోకనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఇంగ్లిష్‌, ఎం.ఎ.ఎకనామిక్స్‌, ఎం.ఎ.ఉర్దూ, ఎం.ఎస్‌.సి కంప్యూటర్‌ సైన్స్‌, ఎం.ఎస్‌.సి బోటని, ఎం.ఎస్‌.సి జువాలజి, ఎం.ఎస్‌.సి ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీలో విద్యార్థులను స్పాట్‌ అడ్మిషన్‌ కింద చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ కార్యాలయంలో హాజరై ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్‌ పొందవచ్చని సూచించారు. బాలికలకు యూనివర్సిటీలో హాస్టల్‌ వసతి కల్పిస్తున్నామని, అలాగే బాలురకు నగరంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు నగరంలోని నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులకు యూనివర్సిటీ బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబర్లు : 8341511632, 9959758609 సంప్రదించవచ్చని వివరించారు.

10 నుంచి అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌

కడప స్పోర్ట్స్‌: కడప నగరంలోని జిల్లా క్రీడాప్రాథికార సంస్థ (డీఎస్‌ఏ) మైదానంలో నవంబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ర్యాలీలో కర్నూలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్‌మెన్‌ తదితర పోస్టులకు ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జాయిన్‌ఇండియన్‌ఆర్మీ.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పొందవచ్చని వివరించారు. ఎంపికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తారని, ఎలాంటి దళారులు, ఏజెంట్లు, మోసగాళ్ల మాటలు నమ్మవద్దని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement