ముగిసిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
పులివెందుల రూరల్: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన విజయవంతంగా ముగిసింది. మంగళవారం బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ఆయన దివంగత సీఎం వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించి.. అక్కడ నుంచి నేరుగా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను కలిసి పలు సమస్యలను విన్నవించారు. రెండవ రోజు బుధవారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటన ముగించుకుని మూడవ రోజు గురువారం తిరిగి ఆయన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.
వైఎస్ జగన్‌ను కలిసిన
ఆర్‌సీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
పులివెందుల టౌన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం ఉదయం రెడ్డి కమ్యూ నిటీ డెవలప్‌మెంట్ సొసైటీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు యర్రపురెడ్డి సురేంద్ర రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రెడ్డి సామాజిక వర్గంలో అనేకమంది పేదలు ఉన్నారని, వారి ఇబ్బందుల గురించి, రెడ్డి రైతుల సమస్యలను వైఎస్ జగన్‌కు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment