●డ్రై స్పెల్స్
వరుసగా 21 రోజులపాటు వాన పడకపోతే దాన్ని ఒక డ్రై స్పెల్‌గా పరిగణిస్తారు. ఇవి పంటలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఖరీఫ్‌లో పెద్దముడియం మండలంలో వర్షపాత లోటుతోపాటు రెండు డ్రై స్పెల్స్ చోటుచేసుకున్నాయి. అంటే 42 రోజులపాటు వర్షమే పడలేదంటే పంటలు ఎలా ఎండిపోయాయో అర్థమవుతుంది.
● కలసపాడు, తొండూరు, వేంపల్లె మండలాల్లో కూడా వర్షపాత లోటుతోపాటు రెండు డ్రై స్పెల్స్ చోటుచేసుకున్నాయి. ఇక పోరుమామిళ్ల, గోపవరం, అట్లూరు, ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో వర్షపాత లోటుతోపాటు ఒక్కొక్క డ్రై స్పెల్ నమోదయ్యాయి. బద్వేలు మండలంలో మాత్రం డ్రై స్పెల్ చోటుచేసుకోకపోయినా వర్షపాత లోటు నమోదైంది. జూన్ 4 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు రెఫరెన్స్ పీరియడ్‌గా తీసుకున్నారు. వర్షపాత లోటు, డ్రై స్పెల్స్‌ను విపత్తుల నిర్వహణ విభాగం మ్యాండేటరీ ఇండికేటర్స్‌గా పరిగణిస్తుంది. అంటే ఒక మండలాన్ని కరువు కింద ప్రకటించాలంటే తప్పనిసరిగా వర్షపాత లోటు, డ్రై స్పెల్ నమోదై ఉండాలి.
● పంటల సాగు విసీ్త్రర్ణం, రిమోట్ సెన్సింగ్, మాయిశ్చర్ అడక్వేట్ ఇండెక్స్, హైడ్రో లాజిక్ ఇండెక్స్‌లను ఇంపాక్ట్ ఇండికేటర్స్‌గా తీసుకుంటారు. ఇందులో పంటల సాగు, దిగుబడి, రిజర్వాయర్లలో నీటి నిల్వ వంటి వివరాలపై జిల్లాలోని ఆయా శాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment