పటేల్ సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
కడప అర్బన్: పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈనెల 31న ‘ఏక్తా దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ సమగ్రత, ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అన్నారు. మొదట సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌లతో పాటు జిల్లా అదనపు ఎస్పీ కె. ప్రకాష్‌బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య తదితర పోలీసు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓ జాన్ ఇర్విన్, మునిసిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, డీసీఆర్‌బి సీఐ డి.భాస్కర్‌రెడ్డి, ఎస్‌బి సీఐ బి.హేమకుమార్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీసు సిబ్బంది స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, లక్ష్య అకాడమీకి చెందిన ఔత్సాహిక పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.
అమరవీరుల సంస్మరణార్థం క్యాండిల్ ర్యాలీ జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాష్‌బాబు అమరవీరుల సంస్మరణార్థం క్యాండిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ప్రజా స్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పోరాడి అమరులైన పోలీసుల త్యాగనిరతికి ఇవే మా జోహార్లు అంటూ ప్రజలు, విద్యార్థులు నివాళులు అర్పించారు. పోలీసుల అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులను ఉంచి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఇన్‌చార్జి కలెక్టర్ అదితిసింగ్,
ఎస్పీ హర్షవర్దన రాజు
Comments
Please login to add a commentAdd a comment