కడప కల్చరల్: కడప నగరంలోని ఇబ్రహీం ఖలీలుల్లా మస్జిద్ వద్ద పవిత్రమైన గ్యార్మి షరీఫ్ మాసాన్ని పురస్కరించుకుని శనివారం నాతియా మెహిఫిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతదేశంలోని ప్రముఖ నాత్ ఖాన్లు హైదరాబాద్ నుంచి ఇమ్రాన్ ముస్తఫా హుసేని, ముంబై నుండి సల్మాన్ రజా అష్రఫీ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పలువురు నాత్ ఖాన్లు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రత్యేకంగా మహిళలకు కూడా పరదా సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు.
4 నుంచి సెమిస్టర్ల పరీక్షలు
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయ పరిధి లోని బీఈడీ కళాశాలల 2, 4 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 4వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలోని16 కేంద్రాలను సిద్ధం చేశామని, 16,900 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు అబ్జర్వర్లతో పాటు హైపవర్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను చదువుతున్న కళాశాల నుంచి పొందాలన్నారు.
పింఛా నుంచి నీటి విడుదల
సుండుపల్లె: మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టు కుడి కాలువకు గేటు అమర్చే క్రమంలో భాగంగా.. ఏటి దిగువకు 300 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నీటి విడుదలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.
రేపు షూటింగ్ బాల్
జిల్లా జట్టు ఎంపిక
రామాపురం: స్థానిక బీసీ కాలనీలోని గురుకుల పాఠశాల బాలుర మైదానంలో ఆదివారం షూటింగ్ బాల్ సీనియర్ బాలుర జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్లు ఉమ్మడి జిల్లా వైఎస్సార్ కడప షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బి.అనిల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ వెంట ఆధార్‌కార్డును తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్: 93918 35714ను సంప్రదించాలని వివరించారు.
నవోదయ ప్రవేశాలకు గడువు పెంపు
కడప ఎడ్యుకేషన్: అన్నమయ్య జిల్లా నారమరాజుపల్లె జవహర్ నవోదయ విద్యాలయలో 2025–26 విద్యా సంవత్సరంలో 11వ తరగతి ప్రవేశానికి ఈ నెల 9వ తేదీ వరకు గడుపు పొడగించినట్లు ప్రధానాచార్యులు యం.గీత ఒక ప్రకటనలో తెలిపారు. అన్నమయ్య, కడప జిల్లాలలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024 –25 సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా స్వీరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 9వ తేదీలోపు https:// cbseitms.nic.in/2024/nvsxi11 వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష 2025 ఫిబ్రవరి 8వ తేదీ నిర్వహించనున్నామన్నారు. వివరాలకు www.navo daya.gov.in ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment