నేడు ఇన్‌చార్జి మంత్రి రాక
కడప సెవెన్‌రోడ్స్ : కలెక్టరేట్‌లో మంగళవారం జరగనున్న డీఆర్‌సీ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్.సవిత రానున్నారని ఇన్‌చార్జి కలెక్టర్ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 6.00 గంటలకు పెనుగొండలోని తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నుంచి డీఆర్సీ సమావేశంలో పాల్గొంటారని ఇన్‌చార్జ్ కలెక్టర్ తెలిపారు.
జేఎన్‌టీయూ వైస్
ప్రిన్సిపల్‌గా శేష మహేశ్వరమ్మ
పులివెందుల రూరల్ : జేఎన్‌టీయూ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా శేష మహేశ్వరమ్మ నియమితులయ్యారు. పట్టణంలోని స్థానిక జేఎన్టీయూలో సోమవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి అనంతపురం జేఎన్‌టీయూ ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్‌గా బదిలీపై వెళ్లా రు. బాధ్యతలు చేపట్టిన శేష మహేశ్వరమ్మను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ
కడప అగ్రికల్చర్ : ఆంధ్రప్రదేశ్ సూక్ష్మనీటి సాగు పథకం (ఏపీఎంఐపీ) ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం కడపలోని ఏపీఎంఐపీ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈయన గతంలో అన్నమయ్య జిల్లా ఏపీఎంఐపి పీడీగా పనిచేసే వారు. ఇటీవలే ఆయనను ఫారిన్ సర్వీస్ కింద కడపకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బిందు, తుంపర సేద్యం అమలుకు కృషి చేస్తానన్నారు. సబ్సిడీతో అందించే పరికరాలను సకాలంలో అందించి రైతు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
బీఈడీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ కళాశాలల 2,4 సెమిస్టర్ల పరీక్షలు సోమవారం జిల్లాలోని 16 కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. వైవీయూ వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు కడపలోని ఎస్వీ బీఈడీ కళాశాల, శ్రీహరి బీఈడీ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎస్వీ కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి కేంద్రానికి అబ్జర్వర్లను ఏర్పాటు చేశామని, హై పవర్ కమిటీ ప్రతినిధులు తనిఖీలు నిర్వహిస్తున్నారని వివరించారు. హైపవర్ కమిటీ సభ్యులు ఆచార్య సునీత, డాక్టర్ రియాజున్నిసా కడపలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ముగిసిన గెస్ట్ ఫ్యాకల్టీ
ఇంటర్వ్యూలు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో కామర్స్, కాంపిట్యూషనల్ డేటా సైన్సెస్ సబ్జెక్టులలో గెస్ట్ ఫ్యాకల్టీ ఇంటర్వ్యూలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. విశ్వవిద్యాలయ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్వ్యూలో వైవీయూ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. కృష్ణారెడ్డి, ఆచార్య ఏజీ దాము, సబ్జెక్ట్ నిపుణులు కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం ఆచార్యులు విశ్వనాథరెడ్డి, తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎం.శ్రీదేవి, ఆచార్య జి. విజయభారతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ప్రశాంతంగా ముగిశాయని ప్రతిభతో పాటు పీహెచ్‌డీ, నెట్ అర్హత ఉన్న వారికి ఎంపికల్లో ప్రాధాన్యత ఇస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment