ఘనంగా నషాన్ ఉత్సవం
దర్గా గుంబద్‌పై దర్శనమిస్తున్న నషాన్
కడప కల్చరల్ : కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ దర్గాలో భక్తులు నషాన్ (ఝేలా) ఉత్సవాన్ని నిర్వహించారు. అందులో భాగంగా మాసాపేట మై అల్లా దర్గా నుంచి నషాన్‌ను ఊరేగింపుగా నగరంలోని భక్తులకు దర్శింపజేశారు. విద్యుద్దీప కాంతుల, బ్యాండు మేళాల మధ్య అట్టహాసంగా ఊరేగింపు నిర్వహించా రు. కృష్ణాసర్కిల్, ఏడురోడ్ల కూడలి, వన్‌టౌన్, గోకుల్ సర్కిల్ మీదుగా వైవీ స్ట్రీట్ నుంచి ఊరేగింపు పెద్దదర్గాకు చేరుకుంది. దర్గాకు చేరిన అనంతరం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసి నషాన్‌ను గుంబద్‌పై ఎగుర వేశారు. ఉరుసు ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు నషా న్ భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment