ఇసుక తవ్వితే మా పరిస్థితేంటి.?
చక్రాయపేట : పాపాఘ్ని నదిలో అక్రమంగా ఇసుక తోడుకునేందుకు వచ్చిన టిప్పర్లను కుమార్లకాల్వ గ్రామ రైతులు అడ్డుకున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వితే భూగర్భ జలాలు అడుగంటి ఫిల్టర్లు ఎండిపోతే మా పరిస్థితి ఏంటి, మేమంతా పంటలు ఎండబెట్టుకోవాల్సిందేనా అంటూ మండిపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయకుమారి, ఆర్కేవ్యాలీ సీఐ నాగరాజు, చక్రాయపేట ఎస్‌ఐ కృష్ణయ్యలు సంఘటన స్థలానికి వెళ్లి రైతులకు సర్దిచెప్పి టిప్పర్లను పంపించి వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మారెళ్లమడక వద్ద ప్రభుత్వం ఇసుక రీచ్‌కు అనుమతి ఇచ్చిందని చెప్పి కొందరు నదిలో రోడ్డు వేసి హిటాచీలతో ఇసుకను టిప్పర్లకు నింపి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇసుక రీచ్‌కు సంబంధించి మండల అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. మారెళ్లమడక వద్ద ఇసుక రీచ్‌కు అనుమతి ఇస్తే కుమార్లకాల్వ వద్ద ఎలా తవ్వుతారని రైతులు నిలదీశారు. దీంతో అధికారులు జోక్యం చేసుకోవడంతో హిటాచీలు, టిప్పర్లను అక్కడి నుంచి తరలించారు. ఇసుక రీచ్‌పై తహసీల్దార్ విజయకుమారి మాత్రం తాను మైనింగ్ అధికారులతో మాట్లాడానని ఇందుకు సంబంధించి అగ్రిమెంట్లు పూర్తయినట్లు చెప్పారని ఆమె వివరించారు.
టిప్పర్లను అడ్డుకున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment