●జిరాఫీ చెస్‌లో దిట్ట సుజన్
ప్రొద్దుటూరు కల్చరల్: జిరాఫీ చెస్ ఆటలో సుజన్ కుమార్‌రెడ్డి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆటలో రాణిస్తున్నాడు. దొరసానిపల్లెకు చెందిన పెద్దిరెడ్డి సునీల్‌కుమార్‌రెడ్డి, వసుంధరల కుమారుడు సుజన్‌కుమార్‌రెడ్డి ఐదేళ్లుగా వివిధ రకాల జిరాఫీ చెస్ పోటీల్లో పాల్గొని రాణించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. అంతర్జాతీ య జిరాఫీ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిరాఫీ చెస్ పోటీల్లో ప్రావీణ్యం సాధించాడు. ప్రతి ఆదివారం నిర్వహించే జిరాఫీ చెస్ పోటీల్లో పాల్గొని 320 ఆటలు ఆడి 214 సార్లు గెలిచి ప్రతిష్టాత్మకంగా బెస్ట్ స్కాలర్ బిరుదు అందుకున్నాడు. 2024 జనవరిలో నిర్వహించిన అండర్–19బాలుర డబుల్స్ పోటీల్లో రన్నర్‌గా నిలిచాడు. ఏప్రిల్‌లో నిర్వహించిన అండర్–13 బాలుర సింగిల్స్ పోటీల్లో రన్నర్‌గా, మేలో నిర్వహించిన ఆండర్–11 బాలుర సింగిల్స్, డబుల్స్ పోటీల్లో విజేతగా నిలిచి డాక్టర్ ప్రతాపరెడ్డి, డాక్టర్ పద్మజా ద్వారా ట్రోఫీ, ప్రశంశలు అందుకున్నాడు. జిరాఫీ చెస్ హ్యాట్రిక్ లీగ్‌లో ప్రొద్దుటూరు పాంథర్స్ జట్టు తరపున ఆడి కేవలం 156 ఎత్తుల్లో ప్రొద్దుటూరు జాగ్వర్స్ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లను అవుట్ చేసి తొలి హ్యాట్రిక్ సాధించి హ్యాట్రిక్ హీరో బిరుదు అందుకున్నాడు. కాగా సుజన్‌కుమార్‌రెడ్డి 5వ తరగతి చదువుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment