సైన్సు సంబరానికి వేళాయె!
కడప ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ఒక గొప్ప వేదిక. 2024–25 విద్యా సంవత్సరానికిగాను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో సైన్సు ప్రాజెక్టుల ప్రదర్శనకు రంగం సిద్ధమయింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమా న్య పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ ప్రాజెక్టుల ప్రదర్శనలో పాల్గొననున్నారు. గత నెల డిసెంబర్ 20వ తేదీ పాఠశాల స్థాయిలో, 28న మండలస్థాయి పోటీలు జరిగాయి. ఇందులో వ్యక్తిగత ప్రాజెక్టులు, గ్రూపు ప్రాజెక్టులు, టీచర్ ప్రాజెక్టుల ప్రదర్శనను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతి మండలం నుంచి మూడు కేటగిరీల్లో విజేతలను ప్రకటించా రు. ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన వారు శుక్రవారం కడపలో నిర్వహించే జిల్లాస్థాయి సైన్సు ఫెయిర్ పోటీల్లో పాల్గొనున్నారు.
కడపలో జిల్లాస్థాయి సైన్సు ప్రదర్శన...
మండలానికి 3 ప్రాజెక్టుల చొప్పన ఎంపిక చేసిన 108 ప్రాజెక్టులు శుక్రవారం కడపలోని మున్సిపల్ హైస్కూల్ మొయిన్‌లో నిర్వహించే జిల్లాస్థాయి సైన్సుఫెయిర్‌లో ప్రదర్శితం కానున్నాయి. జిల్లా స్థాయి సైన్సుఫేర్ పోటీలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులను జ్యూరీ సభ్యులు పరిశీలించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఇందులో వ్యక్తిగత విభాగం నుంచి రెండు ప్రాజెక్టులు, గ్రూపు విభాగం నుంచి రెండు ప్రాజెక్టులు, టీచర్ ఎగ్జిబిట్స్ నుంచి రెండు ప్రాజెక్టుల రాష్ట్ర స్థాయి సైన్సు ఫెయిర్‌కు ఎంపిక చేయనున్నారు.
జిల్లాస్థాయి పోటీలకు 108 ప్రాజెక్టులు ఎంపిక
నేడు కడప మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లాస్థాయి ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment