నేటి నుంచి మాచుపల్లె దర్గా ఉరుసు
సిద్దవటం: మండలంలోని మాచుపల్లె గ్రామ సమీపం ఉన్న హజరత్ సయ్యద్ షావలి దర్గాలో శుక్రవారం నుంచి ఉరుసు మహోత్సవం జరుగుతుంది. ఈ విషయాన్ని దర్గా కమిటీ ముజావర్ సయ్యద్ సలావుద్దీన్ గురువారం తెలిపారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు గంధం మహోత్సవాన్ని పూల చాందినీలో ఊరేగిస్తారన్నారు.అనంతరం ఫాతేహా నిర్వహిస్తారన్నారు. శనివారం రాత్రి ఉరుసు కార్యక్రమం ఉంటుందన్నారు. ఉరుసు రోజు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నారపురెడ్డి శ్రీనివాసులరెడ్డి అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆదివారం ఉదయం తహలీల్ ఫాతెహా జరుతుందని చెప్పారు. అందరూ ఉరుసు మహోత్సవంలో పాల్గొనాలని దర్గా కమిటీ ముజావర్ సయ్యద్ సలావుద్దీన్ కోరారు.
అంగన్వాడీలకు
పుస్తకాలు చేరిక
కడప కోటిరెడ్డిసర్కిల్: అంగన్వాడీ కేంద్రాలకు ఎట్టకేలకు పుస్తకాలు చేరాయి. కూటమి ప్రభుత్వంలో చిన్నారులకు పుస్తకాలు అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఇటీవల ‘మరీ అంత అలుసా’ శీర్షికతో సాక్షి టాబ్లాయిడ్‌లో కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలను సరఫరా చేసింది. కడప–1 ప్రాజెక్టు నుంచి పీపీ1, పీపీ2 పుస్తకాలు అందడంతో వాటిని చిన్నారులకు అందజేశారు. పుస్తకాల పంపిణీలో సీడీపీఓ శోభారాణి, సూపర్‌వైజర్లు రేణుక, దీప, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
8న జెడ్పీ స్థాయీ
సంఘాల సమావేశం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం ఈనెల 8వ తేది ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయంలో జరుగుతుందని ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, అధికారులు స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment