కొనసాగుతున్న కానిస్టేబుల్ ఎంపికలు
కడప అర్బన్: పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలు పకడ్బందీగా సాగుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కడప నగర శివార్లలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డి.టి.సి)లో దేహదారుఢ్య పరీక్షలు 3 రోజు గురువారం కొనసాగాయి. ఈ సందర్భంగా డీటీసీలో ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు దేహదారుఢ్య సామర్థ్య పరీక్షలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేహదారుఢ్య పరీక్షల దగ్గర ఎలాంటి ఆరో పణలు, పొరపాట్లకు తావులేకుండా ఆధునిక ఆర్.ఎఫ్.ఐ.డి కంప్యూటరైజ్డ్ టెక్నాలజీతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఐటీకోర్ టీం ఉన్నారు.
341 మంది అభ్యర్థుల హాజరు: మూడవరోజు దేహదారుఢ్య పరీక్షలకు గురువారం 600 మంది అభ్యర్థులకుగాను 341 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 211 మంది అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment