●అక్కా తమ్ముళ్లు చిచ్చర పిడుగులు
● ప్రొద్దుటూరు చిన్నారుల ప్రతిభ
ప్రొద్దుటూరు: అక్కా తమ్ముళ్లు తమ జ్ఞాపక శక్తితో పతకాల పంట పండిస్తున్నారు. ప్రొద్దు టూరు పట్టణానికి చెందిన పవన్, సౌమ్యల దంపతుల కుమార్తె వినీశ, కుమారుడు ప్రజ్వ ల్ చిన్న వయసులోనే ప్రతిభచాటుతున్నారు. విశ్వనాథుల వినీశ (4) చిన్నారి ప్రస్తుతం యూకేజీ చదువుతోంది. చిన్న వయసులోనే ఆ బాలిక జాతీయ చిహ్నాలు, ట్రాఫిక్ సిగ్నళ్ల రంగాలు, పక్షలు, పండ్లు, కూరగాయలను గుర్తు పట్టడం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచపటంలోని వివిధ దేశాలు, నగరలను అత్యంత సులువుగా చెప్పేస్తోంది. పిరియాడిక్ టేబుల్‌లోని 118 సైన్స్ ఎలిమెంట్స్‌ను కేవలం 52 సెకన్లలోనే చెప్పే నైపుణ్యం సాధించింది. చిన్నారి ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్‌రికార్డ్స్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్‌రికార్ట్స్, కలాం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ రికార్డ్స్, జీనియస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి చిన్నారి అవార్డులు, ప్రశంసాపత్రాలను అందుకున్నారు.
అదే బాటలో తమ్ముడు.. వినీశ సోదరుడు ప్రజ్వల్‌కు ప్రస్తుతం ఏడాది వయసు. బాలుడు వివిధ రకాల పండ్లు, పక్షులు, అంకెలు, కూరగాయల చిత్రాలను చూసి గుర్తించేలా తల్లిదండ్రులు సాధన చేయించారు. ప్రజ్వల్ ప్రతిభను గుర్తించిన నోబెల్ వరల్డ్ రికార్డ్స్ వరకు ప్రశంసా పత్రం అందిచారు. ఈ చిన్నారుల ప్రతిభకు అందరూ ఔరా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment