కడప రిమ్స్‌లో వర్రా రవీంద్రారెడ్డికి వైద్య పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కడప రిమ్స్‌లో వర్రా రవీంద్రారెడ్డికి వైద్య పరీక్షలు

Published Thu, Nov 14 2024 9:16 AM | Last Updated on Thu, Nov 14 2024 9:16 AM

కడప రిమ్స్‌లో వర్రా రవీంద్రారెడ్డికి వైద్య పరీక్షలు

కడప రిమ్స్‌లో వర్రా రవీంద్రారెడ్డికి వైద్య పరీక్షలు

కడప అర్బన్‌ : కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వైద్య పరీక్షలను నిర్వహించారు. వర్రా రవీంద్రారెడ్డి మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలాన్ని స్టేట్‌మెంట్‌గా రికార్డు చేశారు. తనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారని రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు ఆదేశాలతో స్పెషల్‌ పార్టీ పోలీసులు వర్రా రవీంద్రారెడ్డిని భారీ బందోబస్తు మధ్య రిమ్స్‌ క్యాజువాలిటీకి తీసుకుని వచ్చారు. క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ వైద్యులచే పరీక్షలు నిర్వహించారు. తరువాత రాత్రి 7గంటలకు కడప కేంద్రకారాగారానికి పోలీసులు తీసుకుని వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement