ప్రాధాన్యతా రంగాలను పటిష్టం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రాధాన్యతా రంగాల పటిష్టతతోనే జిల్లా అన్ని విధాల అభివృద్ధి పథంలో పయనిస్తుందని, ఆ దిశగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఏపీ ఎంఐపీ,పశుసంవర్ధక శాఖల వారీగా సమీక్షించారు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకల పెంపకందార్లను ఆర్థికంగా ముందుకు నడిపించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. పశువులు, గొర్రెలు, మేకల పెంపకందార్లు.. ప్రభుత్వం కల్పిస్తున్న పశుబీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. సంచార పశువైద్య శాలల ద్వారా గ్రామస్థాయిలో సేవలను విస్తృతం చేయాలన్నారు. ఎక్కడా కూడా పశుగ్రాసం కొరత లేకుండా చూడాలన్నారు. పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా.. ముందస్తు వ్యాక్సిన్లు వేయించాలని సూచించారు. అనంతరం మార్క్ ఫెడ్ , జిల్లా పౌరసరఫరాల శాఖల గురించి తెలియజేస్తూ జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సజావుగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పట్టుపరిశ్రమను పునరుజ్జీవం కల్పించేలా.. ప్రణాళికలు రూపొందించి కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా బ్యాంకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రాథమిక రంగాలను పటిష్ట పరచడం కోసం క్షేత్ర స్థాయిలో అధికారులు సాంకేతికంగా, శాసీ్త్రయంగా నైపుణ్యతతో క్రియాశీలంగా బాధ్యతతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలోసంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment