ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి
అట్లూరు: రోజు రోజుకు ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారని జిల్లా వ్యవసాయ అధికారి ఎ.నాగేశ్వర రావు పేర్కొన్నారు. బద్వేలు మండలం అబ్బూసాహెబ్‌పేట గ్రామంలో ఆదర్శ రైతు గోగుల రాధాకృష్ణయ్య ప్రకృతి వ్యవసాయం పద్ధతి .. డ్రం సీడర్ ద్వారా చేస్తున్న వరి సాగును గురువారం ఆయనతో పాటు స్థానిక వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం.నాగరాజ, బిజివేముల వీరారెడ్డి అగ్రికల్చర్ కళాశాల మొదటి సంవత్సరపు విద్యార్థులతో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు రాధాకృష్ణయ్య పృకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వరి రకాలు నవరా, కాలాబట్టి, కులకర్, పుంగార్, బహురూపి, కూజీ పటాలియా, రత్నశాలి ఈ 7 రకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 257 గ్రామాలలో 36 వేల మంది రైతులు 48 వేల ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజరు ఎస్. ప్రవీణ్‌కుమార్, బద్వేలు వ్యవసాయ అధికారి కె.చంద్రమోహన్‌రెడ్డి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియూ రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment