క్రీడలతో మానసికోల్లాసం
కడప ఎడ్యుకేషన్: క్రీడలతో విద్యార్థినులకు మానసికోల్లాసం కలుగుతుందని కడప అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కె. ప్రత్యేష కుమారి పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024–25 వేడుకల ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి అధ్యక్షతన అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కె. ప్రత్యూష కుమారి, పాలిటెక్నిక్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్మల్‌కుమార్ ప్రియా హాజరయ్యారు. వీరు తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి తదుపరి క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు ఉమ్మడి కడపజిల్లాలోని 13 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో విద్యార్థినిలు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.
అడిషినల్ సీనియర్ సివిల్ జడ్జి
ప్రత్యూష కుమారి
Comments
Please login to add a commentAdd a comment