మాధవరంలో కేంద్ర బృందం పర్యటన
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం మాధవరం వన్‌లో గురువారం కేంద్ర చేనేత, జౌళిశాఖ అధికారులు సృష్టి, జాస్మిన్ పర్యటించారు. ఇక్కడ నేసిన పట్టువస్త్రాలను వేరే ప్రాంత్రాల వస్త్రాలుగా అమ్ముడు పోతుండటంతో వీటికి గుర్తింపు ఇవ్వాలని గతంలో నాబార్డ్ చేసిన సిఫారస్సు చేసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి అధికారుల బృందం సిద్దవటం మండలంలో పర్యటించింది. ఈసందర్భంగా అధికారులు సృష్టి, జాస్మిన్ మాధవరం సమీపంలోని ఎస్‌కేఆర్ నగర్ లో గల చేనేత కార్మికుల గృహాల్లోని మగ్గాలను, నేత వేసిన పట్టు వస్త్రాలను పరిశీలించారు.వస్త్రాల తయారీకి ఎలాంటి ముడిసరుకులు వాడుతున్నారని చేనేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. డీఆర్‌డీఏ పీడీ ఆనంద్ నాయక్, హ్యాండ్ లూమ్స్ ఏడీ పిచ్చేశ్వరరావు ఉన్నారు.
● అంతకుముందు కేంద్ర చేనేత, జౌళి శాఖ అధికారులు ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్యను దర్శించుకున్నారు. అర్చకులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment