కొత్త బోట్లను మంజూరు చేయాలని వినతి
కడప కల్చరల్ : దేవుని(పాత)కడప చెరువులో కొత్త బోట్లను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రముఖలు, సినిమాటోగ్రఫీ, టూరిజం, కల్చరల్ మంత్రి కందుల దుర్గేష్‌కు వినతిపత్రం అందజేశారు. దేవునికడప చెరువులో బోటింగ్‌కు బ్రేక్ పడిన విధానం, బోట్లు లేకపోవడంతో ఆదాయం కోల్పోతున్న అంశంపై ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన స్థానికులు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దుర్గేష్‌ను కలిసి దేవునికడప చెరువును అభివృద్ధి చేయాలని, అందులో భాగంగా నూతన బోట్లను మంజూరు చేయాలని కోరారు. వీటితోపాటు చెరువు కట్టను ఆధునీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేయాలన్నారు. ఇందుకు మంత్రి దుర్గేష్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపట్టగలమని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment