చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకొని అమ్మకాలలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం, జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌరసరఫరాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు, డిజిటల్ సౌలభ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఎంతో కష్టపడి కొన్న వస్తువు నాణ్యత లోపిస్తే వారు ఎంత మనస్తాపానికి గురవుతారో గ్రహించి అలాంటి మోసాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వినియోగదారుల కమిషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రసూల్, జిల్లా ఇన్‌చార్జి పౌరసరఫరాల శాఖ అధికారి రెడ్డి చంద్రిక, ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి షంషీర్ ఖాన్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అర్జున్ రావు, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ కమ్ అడ్వైజర్ పి.రమేష్ పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment