విద్యుత్ షాక్‌తో రైతు మృతి
వేంపల్లె : వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లె గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై రుద్ర శివానందరెడ్డి (40)అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం ఉదయం 6 గంటలకు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని టి.వెలమవారిపల్లె గ్రామానికి చెందిన రుద్ర శివానందరెడ్డి అనే రైతు 12 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీనిలో అరటి, నిమ్మ పంటలను సాగు చేశాడు. అరటి పంటకు మందు కొట్టేందుకు నీరు అవసరం కాగా, సోమవారం ఉదయం రంగారెడ్డి అనే వ్యక్తితో కలిసి రుద్ర శివానందరెడ్డి అరటి తోట వద్దకు వెళ్లాడు. వ్యవసాయ బోరుకు చెందిన మోటార్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రుద్ర శివానందరెడ్డికి తెగిన విద్యుత్ వైర్లు చేతికి తగిలి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో కింద పడిపోవడంతో అతన్ని కాపాడబోయిన రంగారెడ్డికి కూడా విద్యుత్ షాక్ కొట్టడంతో పెద్దగా కేకలు వేశారు. పక్క పొలంలో ఉన్న అతని అన్న వెంకట్రామిరెడ్డి కేకలు విని సంఘటన స్థలానికి వచ్చి గమనించి విద్యుత్ సిబ్బంది సమాచారం ఇచ్చాడు. విద్యుత్ సరఫరాను నిలిపి వేసి చూడగా అప్పటికే రైతు రుద్ర శివానందరెడ్డి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య రమాదేవితోపాటు తిరుపతి రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రెడ్డి నవీన్ రెడ్డి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రైతు మృతితో టి.వెలమవారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి రైతు మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment