గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెండ్లిమర్రి : కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని నందిమండలం గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. మృతుడు రెండు రోజుల క్రితం నందిమండలం గ్రామంలో తిరుగుతుండేవాడన్నారు. నందిమండలం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన మృతదేహం కనిపించడంతో స్థానిక వీఆర్‌ఓ రామచంద్రారెడ్డికి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోడంతో మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు.
హ్యాండ్‌బాల్ స్టేట్ రన్నరప్‌గా కడప జట్టు
కడప స్పోర్ట్స్ : పొట్టిశ్రీరాములు జిల్లా కొవ్వూరు మండలంలోని పాటూరు జెడ్పీ హైస్కూల్‌లో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన 53వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ పోటీల్లో వైఎస్‌ఆర్ కడప జిల్లా జట్టు రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. రాష్ట్రంలోని 16 జిల్లాల జట్లు తలపడగా, కడప జట్టు తొలిమ్యాచ్‌లో విశాఖపై 7–3 స్కోరుతో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. అనంతరం క్వార్టర్ ఫైనల్స్‌లో కర్నూలుపై 8–5 స్కోరుతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌లో కడప జట్టు నెల్లూరుపై 13–2 తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరింది. ఫైనల్‌మ్యాచ్‌లో సత్యసాయి జట్టుతో హోరాహోరీగా తలపడి పరాజయం చెంది రెండోస్థానంలో నిలిచినట్లు జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వి. లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జిల్లా జట్టుకు రన్నరప్ ట్రోఫీ అందజేశారు. జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వి. లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయులు రాధారాణి, భారతి, రవి, రాజశేఖర్, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎర్రచందనం స్వాధీనం .. స్మగ్లర్ అరెస్టు
తిరుపతి మంగళం : అన్నమయ్య జిల్లా బాలపల్లి అటవీ ప్రాంతంలో మూడు ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక స్మగ్లర్‌ను సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బాలపల్లి అటవీ ప్రాంతంలోని గుంజనా సెక్షన్‌లో కూంబింగ్ చేపట్టారు. గంగరాజుపల్లి సమీపంలోని సున్నపురాళ్ల కోన వద్ద ఒక వ్యక్తి తచ్చాడుతూ కనిపించగా అతన్ని పట్టుకుని విచారించారు. మూడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీఎస్పీలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment