వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
మదనపల్లె : వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. కడప శంకరాపురం రామాంజనేయపురం వడ్డేపల్లెకు చెందిన సాబ్‌జాన్ భార్య చెట్టూరి షబానా(29) బెంగళూరులోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఈనెల 16న కడపకు బయలుదేరింది. మార్గమధ్యంలో మదనపల్లె ఆర్టీసీ బస్టాండులో దిగి కనిపించకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లేకపోవడంతో సోమవారం షబానా తండ్రి బంధూషా టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఎస్‌ఐ గాయత్రి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ముగిసిన కళ్లద్దాల టెండర్ల ప్రక్రియ
రాయచోటి (జగదాంబసెంటర్) : జాతీయ అంధత్వ, దృష్టి లోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కంటి అద్దాల టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బడికి వెళ్లే విద్యార్థుల్లో అంధత్వం, దృష్టి లోపం నివారణ కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 3200 కళ్లద్దాల కోసం ఈ నెల 14న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అందిన దరఖాస్తులను సోమవారం ఉదయం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ తనిఖీ చేసిందన్నారు. తక్కువ కొటేషన్ ఇచ్చిన రాయచోటికి చెందిన మస్తాన్‌కు 3200 కళ్లద్దాల తయారీ పనిని అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.
టెంపో వాహనం ఢీకొని
వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లె : టెంపో వాహనం ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. మహారాష్ట్రకు చెందిన షేక్ లతీఫ్(55) మదనపల్లె అమూల్ డెయిరీ నుంచి సామగ్రి తీసుకెళ్లేందుకు వచ్చాడు. వాహనాన్ని లోడింగ్ నిమిత్తం డెయిరీలో పార్క్‌చేసి ఎదురుగా ఉన్న రోడ్డుపై నడిచి వెళుతుండగా, చింతామణి నుంచి మదనపల్లెకు క్యారెట్ లోడ్‌తో వచ్చిన ఐచర్ టెంపో లతీఫ్‌ను ఢీకొంది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment