అమిత్‌షా ప్రజలకు క్షమాపణ చెప్పాలి
కడప సెవెన్‌రోడ్స్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై సాక్షాత్తు పార్లమెంటులోనే అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తక్షణమే భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. షా వ్యాఖ్యలపై సోమవారం ఏపీ ఎమ్మార్పీఎస్ కల్టెరేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవమానించడమంటే భారత రాజ్యాంగాన్నే హేళన చేయడమని తెలిపారు. అంబేడ్కర్ రాజ్యాంగం రచించినందున షా మంత్రి అయ్యారన్న విషయాన్ని మరిచిపోరాదన్నారు. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సహించబోమని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, డప్పు చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, నాయకులు రమణ, ఓబులేశు, నాగరాజు, రామయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment